తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తామే గొప్పంటూ తిరుగుతున్నారు: కేఏ పాల్

  • అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం
  • పొత్తులు పెట్టుకునే ఆలోచన లేదు
  • చంద్రబాబు పాలన దారుణంగా ఉంది
వచ్చే ఎన్నికల్లో ఏపీలోని అన్ని స్థానాల్లో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని.. ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకునే ఆలోచన లేదని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వెల్లడించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో చంద్రబాబు పాలన దారుణంగా ఉందని విమర్శించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక... ఆయన కుటుంబం, ఆయన చుట్టూ ఉన్న ముఖ్య నేతలు బాగుపడ్డారని ఆరోపించారు.

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తామే గొప్పంటూ తిరుగుతున్నారని విమర్శించారు. తమ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న వారు రావాలని కేఏ పాల్ కోరారు. ఈ నెల 29న వైజాగ్‌లో ప్రజాశాంతి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడంతోపాటు, పార్టీ తరుపున కమిటీలు ఏర్పాటు చేస్తామని.. ఇప్పటికే బూత్, విలేజ్ లెవల్‌లో కమిటీలు ఉన్నాయని చెప్పారు. 
Go Back to Shorts
KA Paul
Prajashanthi Party
Chandrababu
Andhra Pradesh
Vizag

More Telugu News